యూపీ హత్యాచార ప్రధాన నిందితుడి అరెస్ట్

ఉత్తర్‌ ప్రదేశ్‌ సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 08 Jan 2021 15:08 IST

బదౌన్‌: ఉత్తర్ప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న సామూహిక అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. గురువారం రాత్రి సత్య నారాయణ్‌ (50) అనే ఆలయ పూజారిని అరెస్టు చేశారు. నిందితుడు ఉఘైతీ గ్రామ సమీపంలోని ఆడవిలో, తన అనుచరుడి ఇంట్లో రహస్యంగా తలదాచుకున్నట్టు తెలిపారు.

బదౌన్‌ జిల్లా ఉఘైతీ గ్రామానికి చెందిన 50 ఏళ్ల బాధితురాలు.. ఈ నెల 3వ తేదీ ఆదివారం సాయంత్రం స్థానిక ఆలయానికి వెళ్లారు. మహిళ ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం ఊరంతా గాలించారు. చివరికి అనుమానాస్పద పరిస్థితుల్లో ఆమె మృతిచెందిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన శవపరీక్షలో మహిళపై అత్యాచారం జరిగినట్టు వెల్లడైంది. అంతేకాకుండా బాధితురాలి పక్కటెముకలు, కాలు విరిగినట్టు.. రహస్యావయవాల్లో గాయాలున్నట్టు కూడా నిర్ధారణ అయింది. దీనితో బదౌన్‌ హత్యాచార ఘటనను.. దిల్లీలో చోటుచేసుకున్న 2012 నాటి నిర్భయ ఘటనతో పోలుస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసుకు సంబంధించి నిందితుల్లో ఇద్దరు నిందితులను మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని పట్టించిన వారికి రూ. 50 వేల రివార్డు కూడా ప్రకటించారు. నిందితుడు సత్య నారాయణ్‌ను ప్రశ్నిస్తున్నామని.. వైద్య పరీక్షల అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరుస్తామని సీనియర్‌ ఎస్పీ సంకల్ప్‌ శర్మ తెలిపారు.

ఇదీ చదవండి..  అత్యాచారం చేసి.. ఎముకలు విరగ్గొట్టి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని