Crime News: భీమిలి రిసార్ట్‌లో పేకాట.. పోలీసుల దాడి: అదుపులో ప్రముఖులు!

విశాఖ జిల్లా భీమిలి శివారులోని ఓ రిసార్ట్‌లో పేకాట నిర్వహిస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) అధికారులు దాడి చేశారు.

Updated : 30 Jan 2022 11:48 IST

విశాఖపట్నం: విశాఖ జిల్లా భీమిలి శివారులోని ఓ రిసార్ట్‌లో పేకాట నిర్వహిస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) అధికారులు దాడి చేశారు. ఆదివారం తెల్లవారుజామున చేసిన మెరుపుదాడిలో పేకాడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.5,70,000 నగదు, రూ. 25 లక్షలు విలువ చేసే 321 కాయిన్స్, తొమ్మిది కార్లు, 23 సెల్‌ఫోన్లు సీజ్‌ చేశారు.

అదుపులోకి తీసుకున్న వారిలో విశాఖ నగరానికి చెందిన ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. పక్కా సమాచారంతో ఎస్‌ఈబీ సీఐలు అప్పలరాజు, నమ్మి గణేష్, జగదీష్.. ఎస్సైలు అమన్ రావు, ఖగేష్, పద్మావతి, జ్ఞానేశ్వరిలు రిసార్ట్‌పై దాడి చేశారు. పోలీసులు దాడులు జరిగితే అధిక సొమ్ము పట్టుబడకుండా ఉండేందుకు పేకాటరాయుళ్లు నగదుకు బదులు కాయిన్స్‌ వినియోగించినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని