ఆమె యాచకురాలు కాదు.. కోటీశ్వరురాలు!

ఈజిప్టులో భిక్షాటన చేస్తోన్న ఓ మహిళను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. కాళ్లు బాగానే ఉన్నా.. ఒక కాలు లేని దివ్యాంగురాలిగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆమెపై వచ్చిన ఆరోపణ. ఈ విషయంపై ఆమెను విచారించిన పోలీసులకు

Updated : 02 Nov 2020 05:14 IST

కైరో: ఈజిప్టులో భిక్షాటన చేస్తోన్న ఓ మహిళను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. కాళ్లు బాగానే ఉన్నా.. దివ్యాంగురాలిగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆమెపై వచ్చిన ఆరోపణ. దీనిపై ఆమెను విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఆ ఆరోపణ నిజం కావడమే కాదు.. ఆమె రూ.కోట్లకు పడగలెత్తిన యాచకురాలని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించిన కథనం ప్రకారం.. నఫీసా అనే మధ్యవయస్కురాలైన మహిళ ఈజిప్టులోని పలు ప్రావిన్స్‌లో గత కొన్నాళ్లుగా దివ్యాంగురాలిగా నటిస్తూ వీల్‌ఛైర్‌లో కూర్చొని భిక్షాటన చేస్తోంది. సాయంత్రం కాగానే వీల్‌ఛైర్‌ పక్కన పెట్టేసి, చక్కగా నడుచుకుంటూ వెళ్లిపోయేది. చాలా మంది ఈ విషయాన్ని గమనించారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు ఆమెను అరెస్టు చేశారు. పక్షవాతం వల్ల ఒక కాలు కోల్పోయినట్లు ఆమె చెప్పినా.. అది అవాస్తవమని తేలింది. విచారణలో ఈ యాచకురాలికి గర్బియా, ఖలిబుయా గవర్నరేట్స్‌లో ఐదు నివాస భవనాలు ఉన్న విషయం బయటపడింది. అంతేకాదు, ఆమెకు చెందిన రెండు బ్యాంక్‌ ఖాతాల్లో 3 మిలియన్‌ ఈజిప్షియన్‌ పౌండ్స్‌(దాదాపు రూ.1.42కోట్లు) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కోటీశ్వరురాలైన ఈ యాచకురాలి విషయంలో మరింత దర్యాప్తు జరిపి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని