Crime News: హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

శంషాబాద్‌లో ఎక్సైజ్‌ పోలీసులుకు గంజాయి చాకెట్ల ప్యాకెట్లు పట్టుబడ్డాయి.

Updated : 16 Jun 2024 19:43 IST

హైదరాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న గంజాయి చాక్లెట్‌ ప్యాకెట్లను శంషాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్‌ ప్రాంతంలో ప్రతి శనివారం జరిగే పార్టీలపై ఎక్సైజ్‌ పోలీసులతో కలిసి డీటీఎఫ్‌ బలగాలు సోదాలు నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై గంజాయి చాక్లెట్స్‌ తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.7 లక్షలు విలువైన 1.65 కిలోల గంజాయి చాక్లెట్‌ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

మరోవైపు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రూ.60లక్షలు విలువ చేసే 164 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందుతుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముఠాపై గతంలోనూ ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసులు ఉన్నాయని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. ఇందులో కొంత మంది సభ్యులు గంజాయిని ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్నారన్న సమాచారంతో వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరుగుతోన్న దృష్ట్యా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని