Amaravati: పాముకాటుకు గురైన కానిస్టేబుల్‌ చికిత్స పొందుతూ మృతి

రాజధాని ప్రాంతంలో బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్‌ పవన్‌ కుమార్‌ పాము కాటుకు గురై చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.

Updated : 24 May 2023 21:51 IST

గుంటూరు: రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్‌ అభివృద్ధి పనుల బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్‌ పవన్‌ కుమార్‌ పాము కాటుకు గురై చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.  వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో కానిస్టేబుల్‌ని సోమవారం రాత్రి  పాము కరిచింది. చుట్టుపక్కల వారు వెంటనే పామును చంపేశారు. కానిస్టేబుల్‌ను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్‌ నుంచి రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పవన్‌ కుమార్‌ బుధవారం సాయంత్రం మృతి చెందారు. పవన్‌ కుమార్‌ ప్రకాశం జిల్లా తాళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బందోబస్తు కోసం అనంతవరం వచ్చి మృత్యువాత పడ్డారు.

చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

కానిస్టేబుల్‌ పవన్‌కుమార్ మృతి పట్ల తెదేపా నేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. పవన్‌కుమార్‌ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని