Hyderabad: పెద్ద అంబర్‌పేట సమీపంలో పోలీసుల కాల్పులు

దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 05 Jul 2024 12:31 IST

హైదరాబాద్‌: దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్‌ శివారు పెద్ద అంబర్‌పేట సమీపంలో ఔటర్‌ రింగురోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. ఇటీవల జాతీయ రహదారిపై పార్కింగ్‌ వాహనాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో నల్గొండ పోలీసులు అప్రమత్తమై నిఘా పెట్టారు. ఆ జిల్లా ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్‌ పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చాక ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు.

దొంగలను పట్టుకునేందుకు రాచకొండ, నల్గొండ పోలీసులు సంయుక్తంగా యత్నించారు. పెద్దఅంబర్‌పేట సమీపంలోని ఓఆర్‌ఆర్‌ వద్దకు వచ్చేసరికి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కత్తులతో ఎదురుదాడి చేయడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని