Published : 19 Jan 2022 19:11 IST

Ts News: సికింద్రాబాద్ క్లబ్‌ అగ్ని ప్రమాద ఘటన.. కొనసాగుతోన్న దర్యాప్తు

హైదరాబాద్‌: సికింద్రాబాద్ క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మహంకాళీ ఏసీపీ రమేశ్ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తేల్చాలని అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖలకు పోలీసులు లేఖలు రాశారు. వాళ్ల నుంచి నివేదిక వచ్చిన తర్వాత... ఆ అంశాలను పరిశీలించి దర్యాప్తు కొనసాగించనున్నారు. ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో సికింద్రాబాద్ క్లబ్ పూర్తిగా కాలిపోయింది. లోపల ఉన్న పురాతన వస్తువలు, ఖరీదైన ఫర్నిచర్‌తో పాటు విదేశీ మద్యం కూడా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.25 కోట్ల విలువైన ఆస్తి నష్టం వాటిల్లినట్లు క్లబ్ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత ప్రతి వస్తువు విలువను ప్రాథమికంగా అంచనా వేసి రూ. 15 కోట్ల వరకు నష్టం సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. క్లబ్‌లో మద్యానికి సంబంధించిన వివరాలను ఆబ్కారీ శాఖ నుంచి పోలీసులు సేకరించే పనిలో పడ్డారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని