Salman Khan: సల్మాన్‌కు బెదిరింపు మెయిల్‌ కేసులో వైద్య విద్యార్థికి లుక్‌అవుట్‌ నోటీసులు

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌(Salman khan)కు ఇటీవల వచ్చిన బెదిరింపుల కేసులో యూకేలో ఉన్న భారత వైద్య విద్యార్థికి పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

Published : 10 May 2023 12:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌(Salman khan)కు ఇటీవల వచ్చిన బెదిరింపుల కేసులో యూకేలోని ఓ వైద్యవిద్యార్థిని నిందితుడిగా గుర్తించారు. అతడికి లుక్‌అవుట్ (LOC) నోటీసులు జారీ చేశారు.  అతడి స్వస్థలం హరియాణా. ఆ విద్యార్థిని ఇండియాకు తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ పేరిట అతడు సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపు ఈ మెయిల్‌ పంపినట్టు అనుమానిస్తున్నారు.

గతనెల సల్మాన్‌ఖాన్‌కు ఓ బెదిరింపు ఈ మెయిల్‌ వచ్చింది. అందులో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ అనుచరుడు గోల్డీ బ్రార్‌తో ముఖాముఖి మాట్లాడి వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలని  లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని సల్మాన్‌ను బెదిరించారు. తొలుత ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన ధకడ్‌ రామ్‌ బిష్ణాయ్‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇటీవల కూడా సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. దుండగుడు ఏకంగా ముంబయి పోలీస్ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించాడు. ఈ కేసులో 16 ఏళ్ల కుర్రాడిని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని