Adibatla kidnap case: యువతి కిడ్నాప్ వ్యవహారం.. దాడికి ముందు ప్లాన్ ప్రకారమే మద్యం పార్టీ..
శుక్రవారం యువతి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులపై కర్రలు, కత్తులతో దాడిచేశారు. అయితే దాడికి ముందు జరిగిన పలు కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్: ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో జరిగిన యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కిడ్నాపర్లు దాడి చేసిన సమయంలో వినియోగించిన రెండు వాహనాలను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు సరూర్‌నగర్ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. ఒక వాహనంలో లభించిన సీసీ కెమెరాలను పోలీసులు సీజ్ చేశారు.
యువతి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులపై కర్రలు, కత్తులతో దాడిచేశారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, సీసీ కెమెరాలు, సెల్ఫోన్లు ధ్వంసం చేశారు. అయితే దాడికి ముందు జరిగిన పలు కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ‘‘యువతి ఇంటిపై దాడి చేసే ముందు నవీన్ రెడ్డి అందర్నీ తన ఆఫీస్‌కు పిలిపించుకున్నాడు. తన దగ్గర పనిచేసే సిబ్బందితో పాటు మరికొంత మందిని తన కార్యాలయానికి రమ్మని చెప్పాడు. పార్టీ పేరుతో అక్కడ మద్యం ఏర్పాటు చేశాడు. కాసేపటికి మద్యం మత్తులో ఉన్న వాళ్లందరినీ కారులో తీసుకొని నవీన్‌రెడ్డి యువతి ఇంటికి వెళ్లాడు. ముందస్తు ప్లాన్ ప్రకారమే అనుచరులను యువతి ఇంటికి తీసుకెళ్లి దాడి చేయించాడు. కిడ్నాప్ చేసిన తర్వాత వివిధ మార్గాల్లో పారిపోయారు’’ అని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
పరారీలోనే నవీన్‌రెడ్డి..
యువతి కిడ్నాప్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 32 మందిని అరెస్టు చేసినట్లు ఆదిభట్ల సీఐ నరేందర్ తెలిపారు. వీరిని రిమాండ్‌కు తరలించామన్నారు. ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నట్లు వెల్లడించారు. నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు నమోదు చేశామని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Pawan Kalyan: సినిమాల నుంచి అప్పుడే రిటైర్డ్ అవ్వాలనుకున్నా.. నా పెళ్లిళ్లు అనుకోకుండానే..!: పవన్ కల్యాణ్
-
Politics News
Nitin Gadkari: నితిన్ గడ్కరీ ఇలాకాలో భాజపాకి ఎదురుదెబ్బ
-
Crime News
Andhra News: విజయవాడలో విషాదం.. వాటర్ హీటర్ తగిలి తండ్రి, కుమార్తె మృతి
-
General News
Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్ సెషన్ 1 ప్రాథమిక కీ విడుదల
-
World News
Pakistan: పోలీసు యూనిఫాంలో వచ్చి.. మారణహోమం సృష్టించి..!
-
Sports News
INDW vs SAW: ముక్కోణపు సిరీస్ ఫైనల్లో భారత్ ఓటమి..