విద్యార్థులను తరిమేసి..బాలికపై అత్యాచారం..కీచకుడిగా మారిన ప్రిన్సిపల్
బిహార్‌లోని కైమూర్ జిల్లాలో ఓ పాఠశాల ప్రిన్సిపల్ దారుణానికి ఒడిగట్టాడు. అదే స్కూల్‌లో చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
పట్నా: విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాల ప్రిన్సిపల్ కీచకుడిగా మారాడు. వయస్సు మరిచిపోయి మృగంలా ప్రవర్తించాడు. కన్న కూతురిలా చూసుకోవాల్సిన విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తోటి విద్యార్థులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగా చూసి.. వారిని తరిమేసి తన కోరిక తీర్చుకున్నాడు. సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘటన బిహార్‌లోని కైమూర్‌లో జరిగింది.
కైమూర్ ఎస్పీ రాకేశ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పిప్రా గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. అదే తరగతికి చెందిన నలుగురు విద్యార్థులు పాఠశాల సమీపంలోని పొలాల్లోకి శనివారం సాయంత్రం ఆమెను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను ఎత్తుకెళ్తున్న విషయాన్ని గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్ సురేంద్ర భాస్కర్ వారిని దూరం నుంచి అనుసరించాడు. కొద్దిసేపయిన తర్వాత బాలిక గట్టిగా కేకలు వేయడంతో ప్రిన్సిపాల్ వాళ్ల దగ్గరికి వెళ్లాడు. అతడిని చూసిన విద్యార్థులంతా అక్కడి నుంచి పారిపోయారు. తొలుత ధైర్యం చెప్పిన ప్రిన్సిపల్.. ఆమెను రక్షిస్తున్నట్లుగా నటించి..తన కోరిక తీర్చుకున్నాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
కొద్దిసేపటి తర్వాత బాలిక గాయాలతో ఇంటికి చేరి, జరిగిన విషయాన్ని ఆమె తల్లికి చెప్పింది. అనంతరం బాధితురాలని కుటుంబ సభ్యులు భాబువా మహిళా పోలీస్టేషన్‌కు తీసుకెళ్లారు. నలుగురు విద్యార్థులతోపాటు పాఠశాల ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రిన్సిపల్‌ను ఆదివారమే అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు చెప్పారు. చికిత్స కోసం బాధిత బాలికను ఆస్పత్రికి తరలించామని, ఆమె కోలుకున్న తర్వాత వాంగ్మూలాన్ని నమోదు చేసి నిందితులను కోర్టు ఎదుట ప్రవేశపెడతామన్నారు. నిందిత విద్యార్థులు కూడా పోలీస్ కస్టడీలోనే ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Pak Cricket: భారత్ మోడల్‌కు తొందరేం లేదు.. ముందు ఆ పని చూడండి.. పాక్‌కు మాజీ ప్లేయర్ సూచన
-
General News
Taraka Ratna: విషమంగానే తారకరత్న ఆరోగ్యం: వైద్యులు
-
Movies News
Yash: రూ. 1500 కోట్ల ప్రాజెక్టు.. హృతిక్ వద్దంటే.. యశ్ అడుగుపెడతారా?
-
India News
Gorakhnath: గోరఖ్‌నాథ్ ఆలయంలో దాడి.. ముర్తజా అబ్బాసీకి మరణశిక్ష
-
Politics News
KTR: రాజ్‌భవన్‌లో రాజకీయ నాయకుల ఫొటోలు సరికాదు: కేటీఆర్
-
Crime News
TS news: ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి.. దిల్లీ ముఠా మోసాలు