Road Accident: నార్సింగి ఓఆర్‌ఆర్‌పై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ఒకరి మృతి

ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు నార్సింగ్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు పై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. 

Published : 23 Jun 2024 23:34 IST

నార్సింగి: హైదరాబాద్‌ నగర శివారు నార్సింగి ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఉప్పల్‌కు చెందిన మమత (33) అక్కడికక్కడే మృతిచెందారు. బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికుల్లో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను నానక్‌రాంగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ బస్సును అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. గచ్చిబౌలి-పటాన్‌చెరు మీదుగా ఈ బస్సు పుదుచ్చేరి వెళ్లాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని