Crime News: స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి హత్యను ఛేదించిన పోలీసులు

గోపాలపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి మృతి కేసును పోలీసులు ఛేదించారు. రాజేశ్‌ అనే వ్యక్తి అంజిరెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Updated : 04 Oct 2023 02:56 IST

సికింద్రాబాద్‌: గోపాలపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి మృతి కేసును పోలీసులు ఛేదించారు. అంజిరెడ్డిని రాజేష్‌ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంజిరెడ్డి ఆస్తులను కాజేసేందుకే నిందితుడు పక్కా ప్రణాళిక ప్రకారం కుట్ర చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇద్దరు బిహారీ వ్యక్తులతో కలిసి అంజిరెడ్డిని రాజేష్‌ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం రహదారి ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 29వ తేదీన గోపాలపురం పోలీసు స్టేషన్‌ పరిధిలో స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి మృతిచెంది కనిపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా నిందితుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు పశ్నించారు. దీంతో ఈ కుట్రకోణం బట్టబయలైంది. అంజిరెడ్డి తన ఆస్తులను అమ్మి అమెరికాకు వెళ్లాలని భావించారు. ఈ క్రమంలో ఆస్తులను అమ్మే పనిని రాజేష్‌కి అప్పజెప్పాడు. ఇదే అదునుగా భావించిన రాజేష్‌ ఎలాగైనా ఆస్తులను తన సొంతం చేసుకోవాలని ఉద్దేశంతో తన పేరిట ఆస్తులను రాయించుకుని అంజిరెడ్డి హత్యకు కుట్ర పన్నాడు. పథకం ప్రకారం ఇద్దరు బిహారీ వ్యక్తులకు సుపారీ ఇచ్చి అంజిరెడ్డిని ఓ వాణిజ్య సముదాయం సెల్లార్‌లో హత్య చేశాడు. అనంతరం గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మృతదేహాన్ని పడవేశారు. పోలీసులకు, కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు రహదారి ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు