Hyderabad: ఆ మొండెం లేని తల ఓ నర్సుది.. మలక్‌పేట కేసులో కీలక పురోగతి

నగరంలోని మలక్‌పేట మూసీ సమీపంలో మొండెంలేని తల దొరికిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

Updated : 24 May 2023 16:36 IST

హైదరాబాద్‌: నగరంలోని మలక్‌పేట వద్ద మూసీ సమీపంలో మొండెం లేని తల దొరికిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొండెంలేని తల ఓ నర్సుదిగా గుర్తించారు. ఆరు రోజుల క్రితం మలక్‌పేటలోని మూసీ పరివాహక ప్రాంతం తీగలగూడ వద్ద నల్లటి ప్లాస్టిక్‌ కవరులో మొండెంలేని తల కనిపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసును ఛేదించారు. మృతిరాలిని ఎర్రం అనురాధగా ధ్రువీకరించారు. ఆమె సోదరి, బావ గుర్తించడంతో పోలీసులు ఆ తల  నర్సు అనురాధదేనని తేల్చారు. ఆమె వడ్డీ వ్యాపారం నిర్వహించేవారని గుర్తించారు. డబ్బుల వ్యవహారంలోనే ఆమె హత్యకు గురైనట్లు నిర్థారణకు వచ్చారు. ఈ కేసులో హంతకుడు చంద్రమౌళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనురాధను హత్య చేసిన తర్వాత నిందితుడు చికెన్‌ షాపులో ఉండే కత్తితో ముక్కలు ముక్కలుగా చేసి బకెట్లో కుక్కి ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. చైతన్యపురిలోని చంద్రమౌళి ఇంట్లో దాచిపెట్టిన మృతురాలి శరీర భాగాలను పోలీసులు, క్లూస్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హత్య వ్యవహారం అంతా చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే జరిగినట్టు మలక్‌పేట పోలీసులు తేల్చారు. చంద్రమౌళిని హత్య జరిగిన చోటుకు తీసుకొచ్చిన పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని