Hyd News: బేగంబజార్‌ పరువుహత్య కేసులో పురోగతి.. కర్ణాటకలో నిందితుల పట్టివేత

నగరంలోని బేగంబజార్‌ మచ్చి మార్కెట్‌ వద్ద పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు

Updated : 21 May 2022 12:21 IST

హైదరాబాద్‌: నగరంలోని బేగంబజార్‌ మచ్చి మార్కెట్‌ వద్ద పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన తర్వాత నిందితులు కర్ణాటక వైపు వెళ్లినట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు 150 కి.మీ.దూరంలో కర్ణాటక గుర్‌మత్కల్‌లో నిందితులను పశ్చిమ మండల టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేస్తున్నారు. అనుమానం ఉన్న మరో 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

బేగంబజార్‌ కోల్సావాడికి చెందిన నీరజ్‌కుమార్‌ పన్వర్‌(22) పల్లీల వ్యాపారి. అదే ప్రాంతానికి చెందిన సంజన(20)ను ఏడాదిన్నర కిందట ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి నెలన్నర క్రితం బాబు పుట్టాడు. ఈ క్రమంలో సంజన కుటుంబీకులు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. నీరజ్‌ను సంజన సోదరుడు ఆరునెలలుగా చంపాలని చూస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం సంజన సోదరుడు, అతని స్నేహితులు  నీరజ్‌ రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వచ్చి గ్రానైట్‌ రాయితో తలపై మోదారు. అనంతరం వెంబండించి కొబ్బరిబొండాల కత్తితో పొడిచి పరారైన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని