Crime News: శారీరక వాంఛ.. ఆడవాళ్లను చంపడమే అతడి లక్ష్యం!

పెందుర్తిలో వరుస హత్యల కేసు మిస్టరీ వీడింది. పోలీసులకు సవాల్‌గా మారిన సైకో కిల్లర్‌ రాంబాబును ఎట్టకేలకు అరెస్టు చేశారు. మంగళవారం విశాఖలో ఏర్పాటు చేసిన

Updated : 16 Aug 2022 19:29 IST

విశాఖ: పెందుర్తిలో వరుస హత్యల కేసు మిస్టరీ వీడింది. పోలీసులకు సవాల్‌గా మారిన సైకో కిల్లర్‌ రాంబాబును ఎట్టకేలకు అరెస్టు చేశారు. మంగళవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను సీపీ శ్రీకాంత్‌ వెల్లడించారు. కుటుంబం దూరం కావడంతో ఆడవాళ్లను చంపడమే అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడని సీపీ వివరించారు.

‘‘2018లో రాంబాబు భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు. భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు అతడిని దగ్గరకు రానివ్వడం లేదు. అంతే కాక.. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ఏజెంట్‌గా పనిచేసి మోసానికి గురయ్యాడు. కొంతకాలం ఆటో నడిపాడు. అప్పటి నుంచి మహిళలపై కక్ష పెంచుకున్నాడు. శారీరక వాంఛతో ఆడవాళ్లను చంపడమే లక్ష్యంగా పెట్టుకుని హత్యలకు పాల్పడ్డాడు. ఈనెల 6న అర్ధరాత్రి చినముషిడివాడ సప్తగిరినగర్‌లో ఓ భవన నిర్మాణం వద్ద కాపలాదారులుగా ఉన్న దంపతులను దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం చనిపోయిన వాళ్లలో మహిళ ఉన్నారా? లేదా? అని తెలుసుకునేందుకు ప్రైవేటు పార్ట్స్‌ చూసేవాడు. ఆ తరువాత కాలితో తన్నేవాడు. ఈనెల 14న సుజాతనగర్‌లోని నాగమల్లి లే అవుట్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌కి ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో భార్య, కుమారుడితో కలిసి దేవుడు కుటుంబం నివసిస్తోంది. నిర్మాణంలో ఉన్న మరో భవనం వద్ద దేవుడు కాపలా ఉండగా అతడి భార్య లక్ష్మి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాంబాబు ఇనుపరాడ్డుతో దాడి చేసి హతమార్చాడు. 3 హత్యలతో పాటు మరొకరిపై హత్యాయత్నం చేశాడు. హత్యలన్నింటికీ ఇనుపరాడ్డును వినియోగించాడు. రాడ్డుతో తలపై మోది చంపేవాడు. రాంబాబు వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడంతో పట్టుకోవడం కష్టమైంది. నిందితుడు ఆలయాలు, ఫంక్షన్‌ హాళ్లలో తింటూ కాలక్షేపం చేసేవాడు. గత కొంత కాలంగా నిందితుడి మానసిక స్థితి సరిగాలేదు.. అద్దె ఇంట్లో క్షుద్రపూజలు చేస్తూ వింతగా ప్రవర్తించడంతో యజమాని ఇల్లు ఖాళీ చేయించాడు’’ అని సీపీ వెల్లడించారు. నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని