Hyderabad: పుడింగ్‌ పబ్‌ కేసు.. నిందితుల బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

పుడింగ్ అండ్‌ మింక్‌ పబ్ కేసులో నిందితుల బెయిల్ పిటీషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్న పోలీసుల వాదనలతో...

Published : 22 Apr 2022 01:31 IST

హైదరాబాద్: పుడింగ్ అండ్‌ మింక్‌ పబ్ కేసులో నిందితుల బెయిల్ పిటీషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్న పోలీసుల వాదనలతో కోర్టు ఏకీభవించింది. పబ్‌లో పట్టుబడిన మాదకద్రవ్యాల విషయంలో నిర్వాహకులదే బాధ్యత అని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ నెల 3వ తేదీన తెల్లవారుజామున దాడి చేసి 4.6 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పబ్ నిర్వాహకుడు అభిషేక్‌తో పాటు, మేనేజర్ అనిల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఈ నెల 14వ తేదీ నుంచి 17 వరకు కోర్టు అనుమతితో 4 రోజులపాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత... నిందితుల తరఫు న్యాయవాది బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. కొకైన్ విషయంలో అభిషేక్, అనిల్‌కు ఎలాంటి సంబంధం లేదని.. పబ్‌కు వచ్చిన వాళ్లలో ఎవరో తీసుకొని వచ్చారని ఆయన వాదించారు. బెయిల్ మంజూరు చేయాలని.. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts