Andhra-Odisha border: ‘పుష్ప’ తరహా సీన్ రిపీట్.. గంజాయి స్మగ్లర్లకు చుక్కలు చూపించిన పోలీసులు!
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 'పుష్ప' సినిమాలో తరహా సీన్ రిపీట్ అయింది. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు ఒడిశా పోలీసులు చుక్కలు చూపించారు.
ఒడిశా: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(AOB)ల్లో 'పుష్ప' సినిమా తరహా సీన్ చోటుచేసుకుంది. ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు ఒడిశా పోలీసులు చుక్కలు చూపించారు. చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ ఆగకుండా దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. అయితే, స్మగ్లర్లు తప్పించుకునేందుకు గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా ఒక్కోటి చొప్పున వేసుకుంటూ పోయిన పోలీసులు వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లారు. ఇదంతా వీడియోలో రికార్డు అయింది. ఈ సందర్భంగా దాదాపు రూ.కోటి విలువైన గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఏవోబీలో గంజాయి స్మగ్లర్లను పోలీసులు తరిమిన దృశ్యాలు.. ‘పుష్ప’ చిత్రంలో ఎర్రచందనం తరలిస్తుండగా అల్లు అర్జున్‌ను పోలీసులు వెంబడించిన దృశ్యాన్ని తలపించేలా ఉంది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
NTR: ‘వార్2’ కంటే ముందే ఆ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ..!
-
Chandrababu: రాజమహేంద్రవరం బయల్దేరిన అమరావతి రైతులు
-
Ambedkar statue: అమెరికాలో ఆవిష్కరణకు సిద్ధమైన 19 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
-
Asian Games: హడలెత్తించిన నేపాల్.. ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం
-
NewsClick: మళ్లీ తెరపైకి ‘న్యూస్‌క్లిక్’ వివాదం.. ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు
-
Nimmagadda Prasad: మళ్లీ ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్