Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
హయత్‌నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన రాజేశ్, టీచర్ సుజాత కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

హైదరాబాద్: హయత్‌నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన రాజేశ్, టీచర్ సుజాత కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు చనిపోవాలనుకున్నారు?ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు స్పష్టమైన ఆధారాలు సేకరించారు. దర్యాప్తు కొలిక్కి రావడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్ధరించారు.
ఏడాదిన్నర క్రితం రాజేశ్ ఇచ్చిన మిస్డ్ కాల్‌తో టీచర్ పరిచయమయ్యారు. ఈ క్రమంలో ఆమె తన వ్యక్తిగత ఫొటోలను రాజేశ్‌కు పంపించారు. ఆమెపై రాజేశ్ అమితంగా ప్రేమ పెంచుకున్నాడు. ఆమె కోసం ఇంటి చుట్టూ ప్రతిరోజు తిరిగేవాడు. రాజేశ్ ప్రవర్తనతో టీచర్ ఒత్తిడికి లోనైంది. ఇద్దరి వ్యవహారం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈనెల 24న వారిద్దరూ చివరిసారి కలుసుకొని పురుగుల మందు తాగి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. టీచర్ పేరు మీద హయత్‌నగర్‌లోని ఒక దుకాణంలో రాజేశ్ పురుగుల మందు కొనుగోలు చేశాడు. ఈనెల 24న ఇంటికెళ్లిన తర్వాత ఆమె పురుగుల మందు తాగారు. రాజేశ్ కూడా అదే రోజు పురుగుల మందు తాగాడు. టీచర్‌ను ఆమె భర్త నాగేశ్వరరావు ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఈనెల 29న మృతి చెందారు. వారిద్దరి ఫోన్లలో ఉన్న పూర్తి వివరాలతో పోలీసులు కేసును ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగానూ పోలీసులు ఆధారాలు సేకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: తెలంగాణ పోలీసింగ్ ఓ సక్సెస్ స్టోరీ: డీజీపీ
-
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Ajit Pawar: ఆ పదవిలో ఎంతకాలం ఉంటానో..! చర్చకు దారితీసిన అజిత్ పవార్ వ్యాఖ్యలు
-
KTR: త్వరలోనే మరో 40వేల డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ: కేటీఆర్
-
Jawan: ‘జవాన్’తో అరుదైన రికార్డు సృష్టించిన షారుక్.. ఒకే ఏడాదిలో రెండుసార్లు..
-
Whatsapp: ఈ ఫోన్లలో త్వరలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..