Crime News: అమెరికాలో బాపట్ల జిల్లా వాసి రాజేశ్‌ కుమార్‌ మృతి

బాపట్ల జిల్లా వాసి అమెరికాలో మృతి చెందాడు. కుటుంబంతో కలిసి బీచ్‌కు వెళ్లిన రాజేశ్‌ సముద్రంలో గల్లంతయ్యాడు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టి రాజేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. 

Published : 02 Jul 2023 23:05 IST

బాపట్ల: అమెరికాలో బాపట్ల జిల్లా వాసి పొట్టి రాజేశ్‌కుమార్‌ మృతి చెందారు. ఉద్యోగరీత్యా ఫ్లోరిడా రాష్ట్రంలోని బ్రిడ్జ్‌ వాటర్ కమ్యూనిటీలో రాజేశ్‌ కుటుంబం నివసిస్తోంది. శనివారం విహారయాత్ర కోసం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జాక్సన్‌ విల్‌ విట్లర్‌ బీచ్‌కు వెళ్లారు. సముద్రంలో అలల తాకిడికి పిల్లలు కొట్టుకుపోతుండగా వారిని కాపాడిన రాజేశ్‌ సముద్రంలో గల్లంతయ్యాడు. మెరైన్‌ పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. రాజేశ్‌ మృతితో బాపట్లలోని ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజేశ్‌ మృతిపట్ల అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని తానా ప్రతినిధులను ఎమ్మెల్యే కోరారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు