Crime News: గుంటూరు జిల్లాలో వివాహితపై హత్యాచారం

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బుధవారం మధ్యాహ్నం వీరంకి లక్ష్మీ తిరుపతమ్మ(40) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత అనుమానాస్పద మృతిగా

Updated : 28 Apr 2022 10:54 IST

దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బుధవారం మధ్యాహ్నం వీరంకి లక్ష్మీ తిరుపతమ్మ(40) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు మృతదేహంపై గాయాలను బట్టి అత్యాచారం జరిగిందని నిర్ధరణకు వచ్చారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను క్లూస్ టీం సేకరిస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తిరుపతమ్మ బంధువైన ఓ యువకుడు ఆమెను కలవడానికి ఇంటికి వెళ్లాడు. ఆమె ఒంటిపై దుస్తులు సక్రమంగా లేకుండా అచేతనంగా పడి ఉండటం గమనించి పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. తిరుపతమ్మకు పదిహేనేళ్ల కిందట శ్రీనివాసరావు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పొలాలకు నీళ్లు పెట్టే ట్యూబులు అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాసరావు పనుల కోసం గ్రామం విడిచి వెళుతుంటాడు. ఒకసారి వెళ్తే ఐదు, ఆరు నెలలు ఇంటికి రారు. గతేడాది డిసెంబరులో ఆయన పనులు కోసం ఇంటి నుంచి వెళ్లారు. మృతురాలి ఇంటి తలుపులు తెరిచి ఉండడం.. ఆమె చెవి రింగులు పక్కనే పడిపోవడం.. గొంతుపై గట్టిగా నులిమినట్లు గుర్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి భర్తను ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన రైల్వేశాఖలో ఎలక్ట్రికల్ పనులు కోసం వెళ్లానని ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్లు చెప్పారు. తాను వెంటనే గ్రామానికి బయల్దేరి వస్తున్నానని, మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్షల కోసం మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని