Rasgulla: పెళ్లి వేడుకలో రసగుల్లా కోసం రచ్చరచ్చ.. కత్తిదాడిలో ఒకరి మృతి

ఓ పెళ్లి వేడుక(Wedding event)లో రసగుల్లా (Rasgulla) స్వీట్ల కోసం జరిగిన కొట్లాటకు ఓ నిండు ప్రాణం బలైపోయింది.

Published : 28 Oct 2022 01:35 IST

ఆగ్రా: ఓ పెళ్లి వేడుక(Wedding event)లో రసగుల్లా (Rasgulla) స్వీట్ల కోసం జరిగిన కొట్లాటకు ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా(Agra) జిల్లా ఎత్మాద్‌పూర్‌ పట్టణంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహల్లా షాయిఖాన్‌ ప్రాంతానికి చెందిన ఉస్మాన్‌ కుమార్తె పెళ్లి వేడుకలో బుధవారం రాత్రి వధువు, వరుడు తరఫు బంధువుల మధ్య రసగుల్లా విషయంలో రచ్చ రచ్చ చేశారు. ఓ వ్యక్తి కత్తితో చెలరేగిపోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.

పెళ్లి వేడుకలో ఏర్పాటు చేసిన విందులో రసగుల్లా అయిపోవడంతో ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో సన్నీ (22) ఏళ్ల వ్యక్తి కత్తిదాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చికిత్సకోసం అతడిని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించగా మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు ఆగ్రా మెడికల్ కాలేజీకి సిఫారసు చేశారు. దీంతో అక్కడ చికిత్స పొందుతూ యువకుడు  మృతిచెందాడు. ఈ దాడిలో గాయాలపాలైన మరో ఐదుగురిని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని