యాదాద్రిలో రేవ్‌ పార్టీ.. 90 మంది అరెస్టు

యాదాద్రి జిల్లాలో నిర్వహిస్తున్న ఓ రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. సంస్థాన్‌ నారాయణ్‌పూర్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు 90 మందిని అదుపులోకి తీసుకున్నారు....

Published : 13 Mar 2021 01:21 IST

భువనగిరి: యాదాద్రి జిల్లాలో నిర్వహిస్తున్న ఓ రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. సంస్థాన్‌ నారాయణ్‌పూర్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. 400 గ్రాముల గంజాయి, 3 ఎల్‌ఎస్‌డీ ప్యాకెట్లు, 120 మద్యం సీసాలు, 15 కార్లు, 30 ద్విచక్రవాహనాలు, 3 ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రేవ్‌ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ హెచ్చరించారు. నిందితులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయనున్నట్లు సీపీ వెల్లడించారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని