Mancherial: మంచిర్యాల ఎమ్మెల్యే బంధువు దారుణహత్య

మంచిర్యాల జిల్లా క్యాథనపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెద్దరేగడిలో వ్యాపారి లక్ష్మీకాంతరావు (54)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు.

Published : 11 Apr 2023 14:42 IST

రామకృష్ణాపురం: మంచిర్యాల జిల్లా క్యాథనపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెద్దరేగడిలో వ్యాపారి లక్ష్మీకాంతరావు (54)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఆయన్ను కత్తులతో పొడిచి దారుణంగా చంపారు. మృతుడు స్థానిక ఎమ్మెల్యే దివాకర్‌రావు బంధువు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఓ స్థలం వ్యవహారంలో లక్ష్మీకాంతరావుకు స్థానికంగా కొందరితో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన్ను హత్యచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని