
Corona: కరోనాను జయించి.. కంటిచూపు కోల్పోయి..
కష్టాలకు తాళలేక ఒకరి బలవన్మరణం
రాజేంద్రనగర్, న్యూస్‌టుడే: కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ తర్వాత తలెత్తిన కష్టాలను తట్టుకోలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదం హైదరాబాద్ రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ప్రేమావతిపేట్కు చెందిన నవీన్‌కుమార్ (36)కు భార్య శ్వేత, రెండున్నరేళ్ల కుమార్తె భవాని ఉన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేసేవారు. ఆయనకు 2020లో కొవిడ్ సోకింది. కోలుకున్న తరువాత.. 2021 జూన్‌లో బ్లాక్ ఫంగస్ వచ్చింది.చికిత్సతో దానినుంచీ కోలుకున్నారు. కానీ బ్లాక్‌ఫంగస్ ప్రభావంతో క్రమంగా ఎడమ కంటి చూపును కోల్పోయారు. దీంతో విధులు సక్రమంగా నిర్వహించలేక ఇబ్బందులు పడ్డారు. ఈ కష్టాలకు తాళలేక నవీన్‌కుమార్ ఈ నెల 13న ఇంట్లో విషం తాగారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం నవీన్‌కుమార్ మృతి చెందారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.