
Published : 23 Jan 2022 01:59 IST
TS news : వనమా రాఘవేందర్ రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుకు మరో 14 రోజులు రిమాండ్ పొడిగించారు. ఫిబ్రవరి 4 వరకు రిమాండ్ పొడిగిస్తూ కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. రాఘవేందర్ రిమాండ్ గడువు నేటితో ముగియడంతో పోలీసులు అతడిని వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. తాజా ఆదేశాలతో రాఘవేందర్ మరో 14 రోజులు జైలులోనే ఉండనున్నారు. నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమంటూ వనమా రాఘవేందర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Tags :