Crime news: వేధింపులు తాళలేక రీసెర్చ్‌ స్కాలర్‌ ఆత్మహత్యాయత్నం

అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో రీసెర్చ్‌ స్కాలర్‌ ఆత్మహత్యకు యత్నించిన ఘటన.. 

Published : 26 May 2022 01:23 IST

లఖ్‌నవూ: అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన ఓ మహిళా రీసెర్చ్‌ స్కాలర్‌.. తన సూపర్‌వైజర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనపై విచారణ కోసం వైస్‌ఛాన్సలర్‌ ఇద్దరు అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. నబీలా ఖానమ్‌ అనే యువతి ఎఎమ్‌యూకు చెందిన జవహర్‌లాల్‌ నెహ్రూ వైద్య కళాశాలలో ఇంటర్ డిసిప్లినరీ బ్రెయిన్ రీసెర్చ్‌ సెంటర్‌లో పరిశోధనలు నిర్వహిస్తోంది. అయితే.. ప్రాజెక్ట్‌ థీసిస్‌కు సంబంధించి సూపర్‌వైజర్ ఒత్తిడి తేవడంతో ఆదివారం రాత్రి నిద్రమాత్రలు మింగి  ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆపస్మారక స్థితిలో ఉన్నయువతిని కళాశాల అనుబంధ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎఎమ్‌యూ అధికార ప్రతినిధి ఉమర్‌ పీర్జాద్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని