Crime News: శ్రీకాకుళం జిల్లాలో కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న ఉపాధి హామీ కూలీలపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

Updated : 04 Feb 2023 17:30 IST

ఆమదాలవలస గ్రామీణం: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఉపాధిహామీ కూలీలపైకి ఓ లారీ అదుపుతప్పి వేగంగా దూసుకెళ్లింది. ఆమదాలవలస-పాలకొండ రోడ్డుపై మందాడ గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ముగ్గురు మందాడ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు