Road Accident: ముగ్గుర్ని పొట్టన పెట్టుకున్న గుంత

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

Published : 06 Jul 2024 03:24 IST

దంతాలపల్లి, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివీ.. తొర్రూరు నుంచి బీరిశెట్టిగూడెం వెళ్తున్న ఆటోలో డ్రైవర్‌తో కలిసి ఆరుగురు ప్రయాణిస్తున్నారు. దంతాలపల్లి శివారు వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై బీటీ దెబ్బతినడంతో మరమ్మతుల కోసం తవ్వి వదిలేసిన గుంత వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో ఈ గుంతను తప్పించే క్రమంలో మరిపెడ నుంచి దంతాలపల్లి వైపు వస్తున్న కారును ఢీకొంది. ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో తొర్రూరు మండలం వెల్లికట్టకు చెందిన ఆటో డ్రైవర్‌ మల్లేశ్‌ (38), దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంకు చెందిన పగిండ్ల కుమార్‌(38), వాల్యాతండాకు చెందిన భూక్యా నరేష్‌(28) అక్కడికక్కడే మృతి చెందారు. అదే ఆటోలో ఉన్న కుమార్‌ భార్య మంజుల, కుమార్తె అంజలి తీవ్రంగా గాయపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని