logo

Hyderabad News: జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడి వద్ద కారు బీభత్సం

నగరంలోని జూబ్లీహిల్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. పెద్దమ గుడి వద్ద కారు అతివేగంతో వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది.

Updated : 12 Aug 2022 11:07 IST

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. పెద్దమ గుడి వద్ద కారు అతివేగంతో వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టింది. ఎయిర్‌ బెలూన్‌ ఓపెన్‌ కావడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్‌ బానోతు చందు మద్యం మత్తుతో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలో ఆల్కహాల్‌ శాతం 111 పాయింట్లు ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని