TG News: పుణె శివారులో ఘోర ప్రమాదం.. తెలంగాణకు చెందిన ఐదుగురి దుర్మరణం

మహారాష్ట్రలోని పుణె శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతిచెందారు.

Published : 02 Jul 2024 20:53 IST

నారాయణఖేడ్‌: మహారాష్ట్రలోని పుణె శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు యువకులు అజ్‌మేర్‌ దర్గా సందర్శనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పుణె శివారులోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, ఖురేషి, రఫిక్‌, ఫిరోజ్‌ కురేషి, మజీద్‌ పటేల్‌ ఘటనా స్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్‌ అమర్‌ను పుణె ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని