Andhra News: బస్సును ఢీకొన్న లారీ.. 20 మందికి తీవ్రగాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సులను లారీ ఢీకొట్టడంతో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Published : 24 Feb 2023 15:07 IST

నక్కపల్లి: అనకాపల్లి జిల్లా ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనకాపల్లి నుంచి పాయకరావుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ధర్మవరం వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. అదే సమయంలో వెనకనుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొనడంతో బస్సు అదుపుతప్పి ముందు ఉన్న మరో ఆటోను ఢీకొట్టి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 20మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు కలిసి క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోల్లో తరలించారు. విశాఖలోని ఇసుకతోటకు చెందిన పరసయ్య (55) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని