
Updated : 27 Jun 2021 14:07 IST
AP News: అనంతలో ఆర్టీసీ బస్సు బీభత్సం
అనంతపురం: అనంతపురంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హిందూపురం నుంచి అనంతపురం నగరానికి వస్తున్న ఆర్టీసీ బస్సు.. జిల్లా కలెక్టరేట్ వద్ద రెండు కార్లు, ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న హరి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న ఇద్దరితో పాటు బైక్పై ఉన్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి
Tags :