Road Accident: యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు- లారీ ఢీ: ఇద్దరు డ్రైవర్ల మృతి

పొద్దుటూరు నుంచి యాత్రికులతో వెళుతున్న ప్రైవేటు బస్సు, లారీ ఢీకొట్టుకోవడంతో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. 

Updated : 21 Sep 2023 23:18 IST

అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-ప్రవేటు బస్సు ఢీకొట్టుకోవడంతో రెండు వాహనాల డ్రైవర్లు మృతి చెందారు. సంబేపల్లి మండలం శెట్టిపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 12 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. బాధితులను ప్రొద్దుటూరు, జమ్మలమడుగు వాసులుగా గుర్తించారు. ప్రొద్దుటూరు నుంచి ప్రైవేటు బస్సు యాత్రికులతో రామేశ్వరం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని