Road Accident: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Updated : 06 Jul 2024 10:34 IST

రామాపురం: అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద టిప్పర్‌ను కారు ఢీంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను కడప వాసులు అంజి నాయక్‌(29), షేక్‌ అలీమ్‌(32), జితేంద్ర(22), షేక్‌ అఫ్రోజ్‌(30)గా గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మరో ప్రమాదంలో ఇద్దరు మృతి

చిత్తూరు: జిల్లాలోని పెద్దపంజాణి మండలం బసవరాజు కండ్రిగ వద్ద టూరిస్టు బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో పది మంది పర్యాటకులకు గాయాలయ్యాయి. అనంతపురం నుంచి తమిళనాడుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను సత్యసాయి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని