
బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం:8 మంది మృతి
పట్నా: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 10 మందితో వెళ్తున్న ప్యాసింజర్ ఆటో, కారు ఢీకొనడంతో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. కటిహార్ జిల్లాలోని కుర్షేలా సమీపంలో 31వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
కటిహార్ ఎస్‌డీపీవో అమర్ కాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. పది మంది సభ్యుల బ్యాండ్ బృందం పూర్నియా నుంచి ఆటోలో బయలు దేరారు. కుర్షేలా సమీపంలోకి రాగానే.. ఎదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలిలోనే మృతి చెందాగా.. మరొకరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించారు. మిగతా నలుగురు తీవ్రగాయాలతో పోరాడుతూ ఆస్పత్రిలో కన్నుమూశారని తెలిపారు. మరో ఇద్దరు గాయాల పాలయ్యారు. ట్రక్కును సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఘటన తర్వాత కారు డ్రైవర్ పరారైనట్లు అమర్‌కాంత్ తెలిపారు. మృతులు.. అర్జున్ మోచి(50), కిశోర్ పాస్వాన్(45), ధర్మేంద్ర కుమార్ మండాల్(50), సుశీల్ కుమార్ మోచి(30), చోటేలాల్ రామ్(42)గా గుర్తించినట్లు కటిహార్ సామాజిక వైద్యశాల డాక్టర్ అనుపమ్ అలోక్ తెలిపారు. వీరంతా మజ్‌దిహా గ్రామానికి చెందిన వారిగా తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.