Crime News: ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు.. బోల్తా పడిన కారును ఢీకొట్టిన మరో బస్సు

పుదుచ్చేరి నుంచి తిరుమలకు వస్తున్న భక్తుల కారు ఆర్టీసీ బస్సును ఢీకొని రోడ్డుపై పల్టీలు కొట్టింది. అదే దారిలో వేగంగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సు.. బోల్తా పడిన కారును మరోసారి ఢీకొట్టడంతో కారు పల్టీలు కొడుతూ రహదారి పక్కకు దూసుకెళ్లింది.

Updated : 18 Feb 2023 11:58 IST

చంద్రగిరి గ్రామీణం: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై తెల్లవారుజామున కనపాకం వద్ద రెండు కర్ణాటక బస్సులు ఒక కారును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... పుదుచ్చేరి నుంచి తిరుమలకు వస్తున్న భక్తుల కారు తిరుపతి జిల్లా కనపాకం దగ్గరకు చేరుకోగానే.. తిరుపతి నుంచి కర్ణాటక వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో పల్టీలు కొడుతూ కారు రోడ్డుపై బోల్తా పడింది. అదే సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న మరో కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా పడిన కారును ఢీకొంది. కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న భక్తులను బయటకు తీసి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చంద్రగిరి పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని