
Road Accident: మహిళా కూలీల ఆటోకు ప్రమాదం: ఇద్దరి మృతి.. ఏడుగురికి తీవ్రగాయాలు
చిలకలూరిపేట గ్రామీణ, యడ్లపాడు: గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్, వడ్డెర కాలనీలకు చెందిన 14 మంది మహిళా కూలీలు ఆటోలో పత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో పత్తితీత పనులకు బయలుదేరారు. యడ్లపాడు వద్దకు రాగానే ఆటోను ఓ వాహనం వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందిని అంబులెన్స్‌లో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షేక్ దరియాబి(55), బేగం(52) మృతిచెందారు. మిగతా ఏడుగురిలో మీనాక్షి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.