Khammam: లారీని ఢీకొన్న కారు.. కుమారుడు సహా దంపతుల దుర్మరణం

ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొణిజర్ల నుంచి వైరా వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో వెనక వెళ్తున్న కారు లారీ వెనక భాగాన్ని ఢీకొంది.

Updated : 01 Jun 2023 15:12 IST

కొణిజర్ల: ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొణిజర్ల నుంచి వైరా వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో వెనక వెళ్తున్న కారు లారీ వెనక భాగాన్ని ఢీకొంది. అదే సమయంలో వెనకాల వస్తున్న మరో లారీ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు వైరా మండలం విప్పలమడక వాసులైన రాజేశ్‌, సుజాత దంపతులు, వారి కుమారుడు ఆశ్రిత్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని