Road Accident: వంతెనపై నుంచి పడ్డ కారు.. ఎమ్మెల్యే కుమారుడు సహా ఏడుగురు విద్యార్థుల మృతి

మహారాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్థా జిల్లాలో 

Updated : 25 Jan 2022 10:18 IST

ముంబయి: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్థా జిల్లాలో వంతెన పైనుంచి కారు కింద పడి ఏడుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భాజపా ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

సావంగిలోని మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుతున్న ఏడుగురు విద్యార్థులు నిన్న రాత్రి 11.30 గంటల ప్రాంతంలో దేవ్లీ నుంచి వార్ధా వెళ్తుండగా.. సెల్సురా వంతెనపై ఓ జంతువు అడ్డం వచ్చింది. ఆ జంతువును తప్పించబోయి వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి వంతెనపై నుంచి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో వారంతా అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతుల్లో గోండ్యా జిల్లా తిరోడా ఎమ్మెల్యే విజయ్‌ రహంగ్డాలే కుమారుడు ఆవిష్కర్‌ సహా ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సావంగి మెడికల్‌ కాలేజీలో ఆవిష్కర్‌ ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఘటన జరిగిన వెంటనే కారులోని వారిని కాపాడాలని ప్రయత్నించినా అప్పటికే వారందరూ మృతిచెందినట్లు స్థానికులు వెల్లడించారు.

ప్రధాని దిగ్భ్రాంతి..

ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని