Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

ప్రకాశం జిల్లా కంభం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓ కారు వెనకనుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తుండగా...

Updated : 08 Aug 2022 06:10 IST

కంభం: ప్రకాశం జిల్లా కంభం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓ కారు వెనకనుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు వాసులుగా గుర్తించారు. మృతుల్లో అనిమిరెడ్డి (60), గురవమ్మ (60), అనంతమ్మ (55),ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24) ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని