Road Accident: స్కూల్‌ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు పాఠశాల బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

Updated : 31 Jan 2023 13:35 IST

ఎల్లాపెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు పాఠశాల బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 30 మందికి గాయాలయ్యాయి. పాఠశాల బస్సులోని 20 మంది విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని క్షతగాత్రులకు సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. 

కామారెడ్డి నుంచి సిరిసిల్ల వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. పాఠశాల బస్సును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన తర్వాత పాఠశాల విద్యార్థులు రక్తమోడిన గాయాలతో తల్లడిల్లిపోయారు. ఓ విద్యార్థి తన తోటి విద్యార్థికి అయిన గాయాలను చూపుతూ చేసిన రోదన అక్కడున్న వారిని కలచివేసింది. 

మరోవైపు ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. జిల్లా కలెక్టర్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడి ప్రమాదం వివరాలను తెలుసుకున్నారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కేటీఆర్‌ ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని