Accident: రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. తండ్రికి గాయాలు.. పాపం ఆ చిన్నారి!

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం శివారులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది

Updated : 23 Sep 2022 19:20 IST

పటాన్‌చెరు అర్బన్‌: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం శివారులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ కుటుంబాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తల్లి అక్కడికక్కడే మృతిచెందగా.. తండ్రి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటనలో సురక్షితంగా బయటపడిన మూడేళ్ల చిన్నారి దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్న దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది.

వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం బురుగుపల్లికి చెందిన వడ్డే రాజు తన కుటంబంతో కలిసి ద్విచక్రవాహనంపై సంగారెడ్డి నుంచి పటాన్‌చెరు వైపు వెళ్తున్నారు. అదే సమయంలో పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో అతడి భార్య వాణి (28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. మూడేళ్ల కుమార్తె శివానీకి స్వల్ప గాయాలైనా.. ఆ చిన్నారి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. తల్లి మృతి చెందడం, తండ్రికి తీవ్రగాయాలై ఆస్పత్రిలో చేరడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని  ఆ పసిపాప ఏడుస్తుండటం స్థానికుల మనసును కలిచివేసింది. తండ్రి వెంటే ఆ చిన్నారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts