Andhra News: కళాకారుల వాహనానికి ప్రమాదం.. ముగ్గురి మృతి

విశాఖలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని తిరుగు 

Updated : 15 Sep 2022 12:11 IST

తుని: విశాఖలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని తిరుగు ప్రయాణమైన కళాకారుల వాహనం తుని వద్ద ప్రమాదానికి గురైంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరానికి చెందిన కొందరు కళాకారులు విశాఖలో ఏటా నిర్వహించే వినాయక నిమజ్జన ఊరేగింపులో నాటకాలు వేస్తుంటారు. ఈ ఏడాది కూడా విశాఖలోని భీశెట్టి వారి వీధి వద్ద ఏర్పాటు చేసిన వినాయక చవితి ముగింపు ఉత్సవాల్లో వీరి బృందం ప్రదర్శన ఇచ్చింది. 10 మంది సభ్యులు, అఘోరా, శివుడు, పార్వతి, వివిధ వేషధారణలు వేసి స్థానికులను మెప్పించారు.

ప్రదర్శన ముగించుకుని రాజమహేంద్రవరం వస్తుండగా ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తుని వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని