
Published : 22 Dec 2020 11:40 IST
కారులోనే ఐదుగురి సజీవదహనం
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు.పోలీసుల కథనం ప్రకారం...యమునా ఎక్స్‌ప్రెస్ వేపై రాంగ్‌రూట్‌లో వస్తున్న ఓ కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో మంటలు చెలరేగి అందులోని ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ నాగాలాండ్ నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి..
పెళ్లిపీటలు ఎక్కకుండానే.. ప్రాణాలు పోయాయ్
Tags :