Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది యాత్రికుల మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలీభీత్‌లోని గజ్రౌలా పరిధిలో ఓ ట్రక్కు చెట్టును ఢీకొట్టింది.

Updated : 23 Jun 2022 15:02 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిలిభిత్‌ జిల్లాలోని గజ్రౌలా ప్రాంతంలో ఓ వ్యాన్‌.. చెట్టును ఢీకొన్న ఘటనలో 10 మంది యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాత్రికులంతా హరిద్వార్‌ నుంచి లఖింపుర్‌కు తిరిగి వస్తుండగా.. గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. నిద్రమత్తులో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు వారు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. బరేలీకి తరలించినట్లు పోలీసులు చెప్పారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ సైతం ఘటనపై విచారం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని