Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..22 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 50మంది యాత్రికుల బృందం ఉన్నావ్‌లోని చంద్రికా దేవి ఆలయాన్ని దర్శించుకొని తిరిగివెళ్తుండగా ఘాటంపూర్‌ వద్ద వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ ట్రాలీ చెరువులో పడిపోయింది.

Updated : 01 Oct 2022 23:34 IST

కాన్పూర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 50మంది యాత్రికుల బృందం ఉన్నావ్‌లోని చంద్రికా దేవి ఆలయాన్ని దర్శించుకొని తిరిగివెళ్తుండగా ఘాటంపూర్‌ వద్ద వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ ట్రాలీ చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో అందరూ మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

‘‘ కాన్పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. నా ఆలోచనలన్నీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపైనే ఉన్నాయి.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. బాధితులకు స్థానిక అధికారులు అన్ని విధాలా అండగా ఉంటారు’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న వెంటనే సీనియర్‌ అధికారులను ప్రమాదస్థలికి వెళ్లాల్సిందిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు.

‘‘ కాన్పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన గుండెల్ని పిండేస్తోంది. తక్షణమే ఘటనా స్థలికి వెళ్లాల్సిందిగా జిల్లా కలెక్టర్‌, స్థానిక సీనియర్‌ అధికారులను ఆదేశించాను. సహాయక చర్యలు ముమ్మరం చేస్తూ.. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సదుపాయాలు అందించమని చెప్పాను. బాధితులు వీలైనంత తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.’’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts