Ts News: హరీశ్‌రావు కాన్వాయ్‌కు ప్రమాదం

సిద్దిపేట శివారులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హరీశ్‌రావు గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. ..

Updated : 24 Sep 2022 17:17 IST

సిద్దిపేట: సిద్దిపేట శివారులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హరీశ్‌రావు గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. రహదారికి అడ్డుగా వచ్చిన అడవి పందులను తప్పించే క్రమంలో పైలట్‌ వాహనం డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశారు. దీంతో కాన్వాయ్‌లోని మిగిలిన కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటన తర్వాత మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రిక కేసీఆర్‌ .. మంత్రి హరీశ్‌రావుకు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని