Road accidents: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలకు 6,337మంది బలి!

గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన గణాంకాలను కేంద్ర రోడ్డు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే పరిస్థితికాస్త మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంది. 

Updated : 29 Dec 2022 09:20 IST

దిల్లీ: 2021లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన గణాంకాలను కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ విడుదల చేసింది.  గతేడాది జాతీయ రహదారులపై 4,12,432 ప్రమాదాలు జరగ్గా.. 1,53,972మంది దుర్మరణం చెందారని వెల్లడించింది. అలాగే, మరో 3,84,448మంది గాయపడినట్టు నివేదికలో తెలిపింది. ‘భారత్‌లో రోడ్డు ప్రమాదాలు 2021’ పేరిట విడుదల చేసిన తాజా నివేదికలో 2019తో పోలిస్తే 2021లో ప్రమాదాలతో పాటు మరణాలు, గాయపడిన వారి సంఖ్యలోనూ తగ్గుదల నమోదైనట్టు పేర్కొంది. 

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..

దేశవ్యాప్తంగా రహదారి ప్రమాదాలు అధికంగా జరిగిన తొలి పది రాష్ట్రాల జాబితాలో ఏపీ ఐదో స్థానంలో ఉండగా.. తెలంగాణ తొమ్మిదో స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో గతేడాది మొత్తంగా 42,871రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 6,337 మంది దుర్మరణం చెందారు. ఏపీలో21,556 ప్రమాదాల్లో 8,186 మంది మృతిచెందగా.. తెలంగాణలో 21,315 ప్రమాదాల్లో7,557మంది ప్రాణాలు విడిచారు. ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీస్ శాఖలు పంపిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్టు పేర్కొంది. 2020లో దేశంలో కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలో రోడ్డు ప్రమాదాలతో పాటు మరణాలు, గాయాలైనవారి సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు