TS NEWS: దగ్ధమైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు హన్మకొండ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా స్టేషన్‌ఘన్‌పూర్‌ వద్దకు

Updated : 23 Jul 2021 17:18 IST

స్టేషన్‌ఘన్‌పూర్‌: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు హన్మకొండ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా స్టేషన్‌ఘన్‌పూర్‌ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును రోడ్డుపక్కన నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దించారు. ప్రయాణికులు బస్సు దిగిన వెంటనే క్షణాల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. కళ్లెదుటే బస్సు దగ్ధం కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 

డ్రైవర్‌ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఇంజిన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని ఆర్టీసీ అధికారులు గుర్తించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రయాణికులంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని