నీరు అడిగినందుకు రైతులను నిర్బంధించిన సర్పంచ్‌!

పంట పొలాలకు నీరు విడుదల చేయాలని అడిగిన రైతులను గ్రామ సర్పంచి నిర్బంధించిన అరుదైన సంఘటన మెదక్‌ జిల్లా శంకరంపేట మండలం శలిపేట గ్రామంలో జరిగింది. రాష్ట్రంలో మండుతున్న ఎండలకు భూగర్భజలాలు అడుగంటాయి....

Updated : 05 Apr 2021 13:58 IST

శంకరంపేట: పంట పొలాలకు నీరు విడుదల చేయాలని అడిగిన రైతులను గ్రామ సర్పంచి నిర్బంధించిన సంఘటన మెదక్‌ జిల్లా శంకరంపేట మండలం శలిపేట గ్రామంలో జరిగింది. మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు అడుగంటాయి. ఫలితంగా గ్రామంలోని పంట పొలాలు ఎండిపోతున్నాయి. అందువల్ల గ్రామంలోని నల్ల చెరువు నుంచి నీరు విడుదల చేయాలంటూ కొందరు రైతులు తహసీల్దారును కోరారు. స్పందించిన తహసీల్దార్‌ వీఆర్‌వోను పంపించగా, సర్పంచి కలుగజేసుకొని గ్రామసభ నిర్వహించిన తర్వాతే నీరు వదులుతామని తెలిపారు. అయితే సర్పంచి గ్రామసభ పెట్టకుండా కాలయాపన చేస్తుండటంతో నీరు విడుదల చేసేందుకు రైతులు చెరువు కట్టకు వెళ్లారు. విషయం తెలుసుకున్న సర్పంచి, అతడి కుమారులు రైతులతో వాగ్వాదానికి దిగారు. తమను అసభ్య పదజాలంతో దూషించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారని రైతులు ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని